Advertisement

కరోనాపట్ల వాళ్లలో జాగ్రత్త అవసరం

By: Dimple Mon, 31 Aug 2020 00:42 AM

కరోనాపట్ల వాళ్లలో జాగ్రత్త అవసరం

తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కరోనా వైరస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 45 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్లు కూడా కరోనా బారినపడుతున్నారని తెలిపారు. 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లోనూ, పురుషుల్లోనూ కరోనా పాజిటివ్ కేసుల శాతంలో పెరుగుదల కనిపిస్తోందని వెల్లడించారు.

‘‘మేం యువత.. కరోనా మాకెందుకు వస్తుందిలే అనుకోవద్దు.. కరోనా ఎవరికైనా వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను పాటించాలి. కరోనా సోకగానే వీలైనంత తొందరగా వైద్యులను సంప్రదించాలి’’ అని తమిళిసై స్పష్టం చేశారు.

కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో.. 60 ఏళ్లు పైబడినవారు జాగ్రత్తగా ఉండాలని, యువతకు వ్యాధి నిరోధక శక్తి మెండుగా ఉండడంతో వారికి ఈ వైరస్ సోకే అవకాశాలు తక్కువని ప్రచారం జరిగింది. అయితే, ఇటీవల వస్తున్న నివేదికల్లో యువతలోనే కరోనా పాజిటివ్ కేసులు అధికంగా వస్తున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై హెచ్చరించారు.

Tags :

Advertisement