Advertisement

  • ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులతో తెలంగాణ గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ..

ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులతో తెలంగాణ గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ..

By: Sankar Tue, 07 July 2020 5:04 PM

ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులతో తెలంగాణ గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ..



రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న వేళ.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రయివేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా సోకిన వారు హాస్పిటల్‌కు వస్తే కచ్చితంగా చికిత్స అందించాలని.. వారిలో భరోసా కల్పించాలని హాస్పిటల్ యాజమాన్యాలకు గవర్నర్ సూచించారు. కరోనా రోగుల పట్ల మానవత్వంతో వ్యవహరించి చికిత్స అందించాలని ఆమె కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా పేషెంట్ల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయొద్దన్నారు.

ఇటీవలి కాలంలో కరోనా పేషెంట్లు ప్రయివేట్ హాస్పిటళ్లకు వెళ్లగా బెడ్లు లేవనే సమాధానం వస్తుండటంతో.. ప్రాణాపాయ స్థితిలోనూ వారు ఐదారు హాస్పిటళ్ల చుట్టు తిరగాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఈ విషయాన్ని ప్రస్తావించిన గవర్నర్.. ఇలాంటి పరిస్థితి తలెత్తొద్దని ప్రయివేట్ హాస్పిటళ్లను హెచ్చరించారు.బాధ్యతాయుతంగా టెస్టులు చేయాలని... అవసరమైతే కార్పొరేట్ హాస్పిటళ్లకు అనుబంధంగా ఉన్న వైద్య కళాశాలల సాయం తీసుకోవాలని గవర్నర్ సూచించారు. హైదరాబాద్ నగరంలోని 11 ప్రయివేట్ హాస్పిటళ్ల యాజమాన్యంతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కాగా రాష్ట్రంలో కరోనా తీవ్రత, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకునేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను రాజ్ భవన్‌కు రావాల్సిందిగా గవర్నర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ మీటింగ్‌ను షెడ్యూల్ చేయగా.. ఈ సమావేశానికి హాజరుకావడం వీలు పడదని సీఎస్ కబురు పంపారు. ముందే తనకు షెడ్యూల్ అయిన కార్యక్రమాల వల్ల సమావేశానికి రాలేమని ఆయన చెప్పారు.

Tags :

Advertisement