Advertisement

  • తెలంగాణాలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ లెక్చరర్లకు ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు

తెలంగాణాలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ లెక్చరర్లకు ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు

By: Sankar Tue, 14 July 2020 6:41 PM

తెలంగాణాలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ లెక్చరర్లకు ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు



దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా అన్ని పాఠశాలలు , కాలేజీలు మూతపడి దాదాపు నాలుగు నెలలు కావొస్తుంది ..అయితే కరోనా కేసులు ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు లేకపోవడంతో విద్యాసంస్థలు ఇప్పట్లో తెరుచుకునేలా లేవు ...అయితే ఇది ఇలాగే ఉంటే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ..దీనితో ఆన్ లైన్ లో పాఠాలు చెప్పేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ..

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ లెక్చరర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్‌ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి 15 రోజుల పాటు ‘డిజిటల్‌ దిశ’ పేరుతో ఆన్‌లైన్‌ క్లాసులు జరుగనున్నాయి. ఇందులో భాగంగా 5300 మంది లెక్చరర్లను 12 బ్యాచ్‌లుగా విభజించి డిజిటల్‌ తరగతులు, ఆన్‌లైన్‌ విద్యా బోధనపై శిక్షణ ఇవ్వనున్నారు..

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, ఎయిడెడ్‌ కాలేజీల లెక్చరర్లను ఆన్‌లైన్‌ బోధనకు సిద్ధం చేసేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. ఈ శిక్షణను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ప్రారంభిస్తారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ వెల్లడించారు

Tags :
|
|

Advertisement