Advertisement

  • ఉల్లి నిల్వలపై ఆంక్షలు విధించిన తెలంగాణ ప్రభుత్వం

ఉల్లి నిల్వలపై ఆంక్షలు విధించిన తెలంగాణ ప్రభుత్వం

By: Sankar Wed, 09 Dec 2020 9:53 PM

ఉల్లి నిల్వలపై ఆంక్షలు విధించిన తెలంగాణ ప్రభుత్వం


ఉల్లి ధరలు మండుతున్నాయి ..సామాన్య జనాలు కొనలేనంత స్థాయికి ఉల్లి ధరలు చేరుకుంటున్నాయి ..ఇప్పటికే కరోనా కారణంగా సరైన ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య జనానికి ఉల్లి ధరలు మరింత కన్నీరు తెప్పిస్తున్నాయి..తాజాగా దేశంలో మళ్ళీ ఉల్లి ధరలు పెరగబోతున్నాయి.

ధరలు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం ఉల్లి నిల్వలపై ఆంక్షలు విధించింది. హోల్ సేల్ వ్యాపారుల వద్ద 250 క్వింటాళ్లు, రిటైల్ వ్యాపారుల వద్ద 20 క్వింటాళ్ల ఉల్లి కి మించి ఎక్కువ ఉల్లి నిల్వ ఉంచుకోరాదని ఆంక్షలు విధించింది. ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ విధమైన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే, వేరే ప్రాంతాల నుంచి దిగుమతులు చేసుకునే వ్యాపారులకు ఈ విషయంలో మినహాయింపులు ఇచ్చింది ప్రభుత్వం. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉల్లి ధరలు అమాంతం పెరిగాయి. వాటిని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం ఉల్లి నిల్వలపై నిబంధనలు విధించింది. మరలా ఇపుడు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఆంక్షలు విధించడం విశేషం.

Tags :

Advertisement