Advertisement

తెలంగాణాలో కరోనా వచ్చినవారిలో మగవారే ఎక్కువ

By: Sankar Wed, 29 July 2020 11:03 PM

తెలంగాణాలో కరోనా వచ్చినవారిలో మగవారే ఎక్కువ



రాష్ట్రంలో కరోనా బారినపడ్డ వారిలో మగవారే అధికంగా ఉన్నారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 65.6% పురుషులే ఉన్నారు. మిగిలిన 34.4% మహిళలు. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన కరోనా బులెటిన్‌లో వెల్లడించింది. ఎన్నడూ లేనట్లుగా 59 పేజీలతో భారీ బులెటిన్‌ను సర్కారు విడుదల చేసింది. అందులో అనేక విషయాలను విశ్లేషించింది.

ఇక ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల్లో 46.13 శాతం మంది కరోనా తీవ్రతతో చనిపోగా, 53.87 శాతం మంది కరోనాతో పాటు ఇతరత్రా అనారోగ్య కారణాలు తోడై చనిపోయినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. నమోదైన కేసుల్లో 65.7% 21–50 ఏళ్లలోపు వారే ఉన్నారు.

అందులో 21 నుంచి 30 ఏళ్ల వయస్సువారు 22.1 శాతం మంది ఉండగా, 31 నుంచి 40 ఏళ్ల వయస్సువారు అత్యధికంగా 25% ఉన్నారు. 41 నుంచి 50 ఏళ్ల వయస్సువారు 18.6% ఉన్నారు. కరోనా బారినపడ్డ వారిలో 81 ఏళ్ల పైబడిన వయసున్న వారు అత్యంత తక్కువగా 0.6% ఉన్నారు.

Tags :
|
|

Advertisement