Advertisement

  • వరంగల్ లో నియో మెట్రో ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు

వరంగల్ లో నియో మెట్రో ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు

By: Sankar Tue, 11 Aug 2020 1:42 PM

వరంగల్ లో నియో మెట్రో ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు



తెలంగాణ అనగానే అందరికి గుర్తొచ్చేది హైదరాబాద్ మహానగరం ..దేశంలో ఉన్న అతి పెద్ద నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా ఒకటి ..ఇక తెలంగాణాలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం అంటే అందరికి గుర్తొచ్చేది వరంగల్ ..అందుకే వరంగల్ నగరాన్ని కూడా హైదరాబాద్ స్థాయిలో డెవెలప్ చేయాలనీ కెసిఆర్ ప్రభుత్వం బావిస్తోంది..

పది లక్షల జనాభా దాటిన వరంగల్ నగరం ఇప్పటికే విద్యా రంగంలో ముందంజలో ఉంది. ఐటీ రంగంలోనూ మెల్లగా ఎదుగుతోంది. వరంగల్ నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మెట్రో రైలును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

మహారాష్ట్రలోని ‘మహా మెట్రో’ తరహాలో వరంగల‌్‌లో నియో మెట్రో ఏర్పాటు కోసం కేటీఆర్ చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, థానే, పుణె, నాసిక్‌ నగరాల్లో అనుసరించిన విధానంలోనే వరంగల్‌లో మెట్రో ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మహా మెట్రో ప్రతినిధులు గత డిసెంబర్లో వరంగల్ వచ్చి మెట్రో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేశారు.

కాజీపేట నుంచి పెట్రోల్‌ పంపు.. అక్కడి నుంచి పోచమ్మ మైదాన్‌ మీదుగా వెంకట్రామ టాకీస్‌ నుంచి వరంగల్‌ రైల్వే స్టేషన్‌ వరకు దాదాపు 15 కిలోమీటర్ల పొడవు మెట్రో మార్గాన్ని నిర్మించొచ్చని.. దీనికి రూ.1400 కోట్ల వరకు ఖర్చవుతుందని మహా మెట్రో ప్రతినిధులు ప్రాథమికంగా అంచనా వేశారు. వరంగల్‌ నగర ట్రాఫిక్‌, రవాణా వ్యవస్థ, ప్రజల ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేస్తూ.. కోటి రూపాయలతో మహా మెట్రో డీపీఆర్‌ను రూపొందిస్తోంది

Tags :

Advertisement