Advertisement

  • తెలంగాణాలో మందు బాబులకు గుడ్ న్యూస్ ...బార్లు , క్లబ్బులు ఓపెన్

తెలంగాణాలో మందు బాబులకు గుడ్ న్యూస్ ...బార్లు , క్లబ్బులు ఓపెన్

By: Sankar Fri, 25 Sept 2020 5:42 PM

తెలంగాణాలో మందు బాబులకు గుడ్ న్యూస్ ...బార్లు , క్లబ్బులు ఓపెన్


కరోనా కారణంగా మార్చి 22 నుంచి బార్లు మూతపడ్డాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో బార్లు, క్లబ్ లు తెరుచుకోలేదు. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్కదానికి అనుమతి ఇస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకున్నాయి. రవాణ వ్యవస్థ కూడా ప్రారంభం అయ్యింది. దేవాలయాలకు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. ఇక విద్యార్థులకు సంబంధించిన పరీక్షలు కూడా జరుగుతున్నాయి.

ఇక తెలంగాణలో కరోనా వైరస్ ఉదృతి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉండటంతో, బార్లు, క్లబ్ లు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తున్నట్టు ఆర్డర్ కాపీలో ప్రభుత్వం పేర్కొన్నది. అయితే, బార్లకు అనుమతి ఇచ్చినా పర్మిట్ రూమ్ లకు అనుమతి ఇవ్వలేదు. అదే విధంగా బార్లు, క్లబ్ లలో గ్యాదరింగ్, మ్యూజికల్ ఈవెంట్స్, డ్యాన్స్ లకు అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వం పేర్కొన్నది. బార్లు, క్లబ్ లు కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం పేర్కొన్నది.

ఇక తాజాగా తెలంగాణాలో 2381 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా అందులో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,81,627 కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 30,387గా ఉన్నాయి. మరో 24,592 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 2,021 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక గురువారం మరో 10 మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1080కి చేరింది.

Tags :
|
|
|

Advertisement