Advertisement

  • రేపటి నుంచి రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్..

రేపటి నుంచి రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్..

By: Sankar Mon, 07 Sept 2020 3:54 PM

రేపటి నుంచి రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్..


తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్‌ చేస్తూ ఆదివారం ఉత్తర్వులిచ్చింది.

కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రి జరిగే కేబినెట్‌ భేటీలో నూతన రెవెన్యూ చట్టానికి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఇక ముందు నుంచీ అనుకుంటున్నట్టుగా గ్రామ అధికారుల వ్యవస్థ రద్దు దిశగా కేసీఆర్‌ సర్కార్‌ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.

కాగా, అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కోవిడ్‌ నిబంధనలు పాటించి సభ్యులంతా సమావేశాలకు హాజరయ్యారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, నెగటివ్‌ వచ్చినవారినే సభలోకి అనుమతించారు. సోమవారం నాటి సమావేశంలో ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మొదలకు వారికి శాసన సభ సంతాపం ప్రకటించింది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది.

Tags :
|
|

Advertisement