Advertisement

  • కరోనా నియంత్రణకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం...

కరోనా నియంత్రణకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం...

By: Sankar Wed, 18 Nov 2020 10:53 AM

కరోనా నియంత్రణకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం...


కరోనా వైరస్‌ కట్టడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. నాలుగు గోడల మధ్య సామాజిక, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మత, రాజకీయ సమావేశాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఈ నిబంధనల ప్రకారం.. 200 మంది హాల్‌ సామర్థ్యంలో 50 శాతం హాజరుతో సామాజిక సమావేశాలు అనుమతించారు. తెలంగాణలో ప్రస్తుతం కరోనా పరిస్థితిని నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం అందివచ్చే వనరులను వినియోగించుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. సామాజిక, విద్య, క్రీడలు, సాంస్కృతిక, మత రాజకీయ కార్యక్రమాలకు, ఇతర సమ్మేళనాలకు 100 మంది హాల్‌ సమార్థ్యంతో జరుపుకోవడానికి ఇప్పటికే అనుమతి ఇచ్చారు.

ఇక్కడ పేర్కొన్న సమ్మేళనాలు రాష్ట్రంలోని కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల మాత్రమే అనుమతిస్తారు. ఫేస్‌ మాస్క్ లు ధరించడం, సమాజిక దూరం, థర్మల్‌ స్కానింగ్‌, హ్యాండ్‌ వాష్‌ లేదా శానిటైజర్‌ వాడకం తప్పనిసరి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమావేశాలకు ఇంతకు ముందు, పరిమితి 100 మందికి మాత్రమే ఉండేది ఇప్పుడు దాన్ని 200 మందికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Tags :
|

Advertisement