Advertisement

  • జూన్ 7 వరకు కొత్త లాక్ డౌన్ రూల్స్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

జూన్ 7 వరకు కొత్త లాక్ డౌన్ రూల్స్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

By: chandrasekar Mon, 01 June 2020 12:06 PM

జూన్ 7 వరకు కొత్త లాక్ డౌన్ రూల్స్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం


లాక్‌డౌన్‌ 5.0 తర్వాత కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్ డౌన్ విధిస్తూ కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త రూల్స్ జారీ చేసింది. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్‌నే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం కంటైన్మెంట్ జోన్ల బయట ఏవైతే లాక్ డౌన్ నిబంధనలు ప్రస్తుతం అమలవుతున్నాయో అవి జూన్ 7 వరకు కొనసాగుతాయి.

గతంలో రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు ఉన్న కర్ఫ్యూను సడలించి రాత్రి 9 నుంచి తెల్లవారుజాము 5 వరకు కర్ఫ్యూ ఉంచారు. వ్యక్తులు అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అందుకు ఎలాంటి పర్మిషన్లు అవసరం లేదు. అయితే, ప్రజారవాణా మీద అందులో ఎలాంటి నిబంధనలను పేర్కొనలేదు.

telangana,government,issued,new lockdown,rules ,జూన్,  కొత్త, లాక్ డౌన్, రూల్స్, జారీ


కేంద్రం ఇచ్చిన లాక్‌డౌన్ 4 గైడ్ లైన్స్‌లో మాత్రం ఇతర రాష్ట్రాలు పరస్పరం చర్చించుకుని అనుమతులు తీసుకుని బస్సులు నడపవచ్చు. కేంద్రం చెప్పినట్టు కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు జూన్ 30 వరకు కొనసాగుతాయి. రాత్రి 8 గంటలు దాటిన తర్వాత దుకాణాలు తెరవడానికి వీల్లేదు. కేవలం ఆస్పత్రులు, ఫార్మసీలు మాత్రమే తెరిచి ఉంచవచ్చు.

Tags :
|

Advertisement