Advertisement

  • షూటింగులకు నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

షూటింగులకు నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

By: chandrasekar Wed, 10 June 2020 11:07 AM

షూటింగులకు నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

లాక్‌ డౌన్‌ సడలింపుల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కార్యకలాపాలకు అనుమతినిస్తున్నాయి. సినిమా చిత్రీకరణలకు కూడా అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా అందుకు తగ్గ మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా కేసుల ఉధృతి ఇంకా కొనసాగుతున్న టైం లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సినిమా షూటింగుల సమయంలో ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందేనని నిర్దేశించింది. సినిమాలు, టీవీ సీరియళ్లు, రియాలిటీ షోల చిత్రీకరణలకు సోమవారం సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. షూటింగ్ సమయంలో పాటించాల్సిన విధానాలు, నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లౌజులను అందుబాటులో ఉంచాలి. గరిష్ఠంగా 40 మంది సిబ్బందితో మాత్రమే షూటింగ్ ప్రక్రియలో పాల్గొనాలి. చిత్రీకరణ జరిగే ప్రాంతాల్లో బీడీలు, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు, పాన్‌ నమలడం నిషిద్ధం.

స్టూడియోల్లోకి సందర్శకులకు అనుమతి ఇవ్వకూడదు. సాధ్యమైనంత మేరకు ఇండోర్‌‌లోనే షూటింగ్‌లు జరుపుకొనేలా ప్రణాళిక వేసుకోవాలి. కంటైన్మెంట్ జోన్లలో సినిమా షూటింగ్‌లకు అనుమతి లేదు.

telangana,government,has released,guidelines,with regards to shootings ,షూటింగులకు, నిబంధనలతో, కూడిన మార్గదర్శకాలను, విడుదల, చేసిన తెలంగాణ ప్రభుత్వం

షూటింగ్ లొకేషన్లు, సెట్లలో చిత్రీకరణలో పాల్గొనే వ్యక్తులు ప్రతి ఒక్కరూ మాస్క్ కచ్చితంగా ధరించాలి. అదే సమయంలో భౌతిక దూరం పాటించాలి. స్పాట్‌లో వైద్యుణ్ని అందుబాటులో ఉంచుకోవాలి.

మెడికల్ క్లియరెన్స్ లేనిదే 10 నుంచి 60 ఏళ్ల లోపు వారికి షూటింగ్‌లకు అనుమతి ఇవ్వవద్దు. అనుమతి లేదు. షూటింగ్‌లో పాల్గొనే ప్రతి ఒక్క వ్యక్తి నుంచి మెడికల్ డిక్లరేషన్ తీసుకోవాలి. చిత్రీకరణకు ముందు సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని చెక్ చేయించుకోవాలి. నటీనటులు, సిబ్బంది తమ ఆహారాన్ని, తాగు నీటిని ఇంటి నుంచే తెచ్చుకోవాలి. నటీనటుల వ్యక్తిగత మేకప్ కిట్లు ఒకరివి మరొకరు ఉపయోగించకూడదు.

Tags :

Advertisement