Advertisement

  • ఆంధ్ర ప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ న్యాయ పోరాటం

ఆంధ్ర ప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ న్యాయ పోరాటం

By: chandrasekar Thu, 06 Aug 2020 1:01 PM

ఆంధ్ర ప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ న్యాయ పోరాటం


ఏపీ చేపట్టిన సంగమేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంను ఆపాలంటూ తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎట్టకేలకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసీఆర్‌ సర్కారు ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని పిటిషన్‌లో కోరింది. నిజానికి మే 11న నిర్వహించిన రివ్యూలోనే ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తామని సీఎం ఆఫీసు ప్రకటించినా ఆ దిశగా కనీస ప్రయత్నాలు చేయలేదు. మరోవైపు తెలంగాణ సర్కారు ఉదాసీనతను ఆసరాగా తీసుకున్న ఏపీ ఏకంగా టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టింది. వరుస కథనాలతో ప్రతిపక్ష పార్టీలు, ఉద్యమ వేదికలు సర్కారుపై ఒత్తిడి పెంచడంతో ఏపీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈ- ఫైలింగ్‌ ద్వా రా స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీవ్‌ పిటిషన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. దీనిపై రెండు రోజుల్లోసుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

ఏపీ సర్కారు గతేడాది డిసెంబర్‌లోనే శ్రీశైలం ఫోర్ ‌షోర్‌లో సంగమేశ్వరం లిఫ్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీంను నిర్మిస్తామని, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యు లేటర్‌ను 44 వేల క్యూ సెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతామని ప్రకటించింది. రీఆర్గ‌నైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అతిక్రమించి ఏపీ ప్రభుత్వం మే ఐదో తేదీన 203 జీవో ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యు లేటర్‌ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాల్వల క్యారీయింగ్‌ కెపాసిటీ పెంపునకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ఈ కథనాలతో ప్రతిపక్షాలు, ఉద్యమ వేదికలు స్పందించి ఏపీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాయి. చివరికి సీఎం కేసీఆర్‌ మే 11న ఏపీ ప్రాజెక్టులపై రివ్యూ చేశారు. దక్షిణ తెలంగాణకు నష్టం చేకూర్చేలా ఏపీ చేపడ్తున్న ప్రాజెక్టులపై కేంద్రానికి కంప్లైంట్ చేస్తామని ఎన్ని కోట్లయినా ఖర్చు చేసి ప్రముఖ న్యాయవాదులను పెట్టి సుప్రీంకోర్టులో పిటిషన్‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దాఖలు చేస్తామని ప్రకటించారు.

పోటాపోటీ కంప్లైంట్లు ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రెటరీ రజత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌ మే 12న కృష్ణా బోర్డు చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కంప్లైంట్‌ చేశారు. దానికి ప్రతిగా తెలంగాణ నిర్మిస్తున్నఅన్ని ప్రాజెక్టులపై ఏపీ కంప్లైంట్ ‌చేసింది. మరోవైపు ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపాలంటూ బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్‌.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లెటర్‌ రాశారు. స్పందించిన కేంద్ర మంత్రి ఆ ప్రాజెక్టుల విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా ఆపేలా ఆదేశించాలని కృష్ణా బోర్డుకు సూచించారు. ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాలు నిర్వహించి రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చించారు. ఇరు రాష్ట్రాలు నిర్మిస్తున్నప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వడంతో పాటు అపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎజెండా ఇవ్వాలని బోర్డుల మీటింగులో సూచించారు. కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్ద‌ని ఏపీని ఆదేశించారు.

ఎన్జీటీ స్టేతో ఏపీకి బ్రేకులు

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి )లో నారాయణపేట జిల్లాకు చెందిన రైతు గవినోళ్ల శ్రీనివాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఏపీ దూకుడుకు బ్రేకులు పడ్డాయి. 2 నెలల పాటు ప్రాజెక్టు పనులు చేపట్టొద్దంటూ ఎన్జీటి స్టే ఇచ్చింది. ట్రిబ్యునల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జోక్యం చేసుకోకుంటే ఇప్పటికే ఆంధ్ర సర్కారు టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యేది. రైతు పోరాటంతో ఆంధ్ర ప్రాజెక్టుకు బ్రేకులు పడినా ఆ టైంను సద్వినియోగం చేసుకోవడంపై తెలంగాణ సర్కారు దృష్టి పెట్టలేదు.

సంగమేశ్వరం లిఫ్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీంకు అపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుమతి తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. రీ ఆర్గ‌నైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఇరు రాష్ట్రాల్లోఎక్కడ కొత్త ప్రాజెక్టు చేపట్టినా కౌన్సిల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అనుమతి తప్పనిసరని, ఆంధ్ర ప్రాజెక్టుకు ఆ అనుమతి లేదని వివరించింది. ప్రాజెక్టు డీపీఆర్‌ ఇవ్వాలని కృష్ణాబోర్డు రెండు సార్లు ఆదేశించినా పట్టించుకోకుండా ఆంధ్ర టెండర్లు పిలిచిందని నివేదించింది. ఆ టెండర్ల ప్రక్రియ నిలిపేసేలా ఆదేశించాలని కోరింది. జూలై 30 నాటి రివ్యూలో తీసుకున్న నిర్ణ‌యం మేరకు సుప్రీంలో పిటిషన్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేశామని సర్కారు ప్రకటించింది.

Tags :

Advertisement