Advertisement

  • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జీతం చెల్లింపులో నెలకొన్న ఆందోళన

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జీతం చెల్లింపులో నెలకొన్న ఆందోళన

By: chandrasekar Wed, 17 June 2020 7:18 PM

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జీతం చెల్లింపులో నెలకొన్న ఆందోళన


కరోనా ఉధృతి కారణంగా ప్రభుత్వానికి ఆదాయం తక్కువై ఉద్యోగుల జీతంలో కొత్త విధించిన విషయం అందరికి తెలిసిందే. కరోనా కారణంగా మార్చి నుంచి తెలంగాణలోని అనేక ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు నెల నెల సగం జీతం మాత్రమే వస్తోంది. వైద్య, పోలీస్, పారిశుద్ధ్య, విద్యుత్ వంటి కొన్ని శాఖలు మినహాయిస్తే చాలా శాఖల ఉద్యోగులు సగం జీతంతోనే కాలం వెల్లదీస్తున్నారు. మే నెలలో లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఆ నెలలో తమకు ప్రభుత్వం పూర్తి జీతం ఇస్తుందని ఉద్యోగులు భావించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోలేదు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలో వున్నారు.

ప్రస్తుతం జూన్ నెల విషయంలో ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి నెలకొంది. ఈనెల అయినా తమకు పూర్తి జీతాలు వస్తాయో లేదో అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వారిని టెన్షన్ పెడుతోంది. మరోవైపు ఈ నెల జీతం, ఫించన్‌లో కోతలు పెట్టొద్దని ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ సహా సీఎస్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి జేఏసీ నేతలు ఈ మెయిల్ ద్వారా వినతి పత్రం పంపించారు. మరోవైపు ఇదే అంశంపై తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవో) సైతం తమ సమావేశంలో కీలకంగా చర్చింది. జూన్‌లో పూర్తి జీతం ఇవ్వడంతో పాటు గత మూడు నెలల బకాయిలను కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల సమస్య ఒక కొలిక్కి వచ్చినట్లవుతుంది.

Tags :

Advertisement