Advertisement

  • తెలంగాణాలో నిన్న కరోనా హెల్త్ బులిటెన్ రాలేదు ఎందుకో తెలుసా ..!

తెలంగాణాలో నిన్న కరోనా హెల్త్ బులిటెన్ రాలేదు ఎందుకో తెలుసా ..!

By: Sankar Sun, 26 July 2020 09:28 AM

తెలంగాణాలో నిన్న కరోనా హెల్త్ బులిటెన్ రాలేదు ఎందుకో తెలుసా ..!



కరోనా కొత్త కేసులు, మరణాలకు సంబంధించి రోజూ ప్రభుత్వం విడుదల చేసే హెల్త్ బులెటిన్ శనివారం విడుదల కాలేదు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేయనందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ శనివారం రాత్రి వివరణ ఇచ్చింది. కొత్త విధానంలో ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని ఓ ప్రకటన జారీ చేసింది.

ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త ఫార్మాట్‌లో కరోనా కేసుల వివరాలు వెల్లడిస్తామని ప్రభుత్వం ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక తెలంగాణలో శుక్రవారం నాటికి 52,466 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌ 19 బారిన పడి ఇప్పటివరకు 455 మంది మృతి చెందారు.

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 15,445 పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు 3,37,771 శాంపిల్స్‌ పరీక్షించారు. ప్రతి పది లక్షల జనాభాకు సగటున 8,444 పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 40,334 మంది డిశ్చార్జ్‌ కాగా, 11,677 మంది చికిత్స తీసుకుంటున్నారు.

Tags :

Advertisement