Advertisement

  • తెలంగాణాలో ఆయుష్మాన్ భారత్ అమలు ..సంచలనం నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణాలో ఆయుష్మాన్ భారత్ అమలు ..సంచలనం నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

By: Sankar Wed, 30 Dec 2020 10:25 PM

తెలంగాణాలో ఆయుష్మాన్ భారత్ అమలు ..సంచలనం నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం


తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది... ఆరోగ్య శ్రీ తో పాటు ఆయుస్మాన్ భారత్ ని తెలంగాణలో అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు.. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి తెలిపారు సీఎస్ సోమేష్ కుమార్...

ఇవాళ ఢిల్లీలోని బీఆర్కే భవన్ నుండి ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.. ప్రధాని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, జల్ జీవన్ మిషన్ పథకాల మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం మిషన్ భగీరథ ద్వారా అన్ని గృహాలకు పంపులతో సురక్షితమైన నీటిని అందించిందని తెలిపారు.. తెలంగాణ రాష్ట్రంలో 98.5 శాతం గృహాలు సురక్షితమైన తాగునీటితో కవర్ అయ్యాయని భారత ప్రభుత్వం గుర్తించిందని గుర్తుచేశారు.. ఇక, సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు

Tags :

Advertisement