Advertisement

  • నియంత్రిత సాగు విధానానికి స్వస్తి చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

నియంత్రిత సాగు విధానానికి స్వస్తి చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

By: Sankar Sun, 27 Dec 2020 10:14 PM

నియంత్రిత సాగు విధానానికి స్వస్తి చెప్పిన తెలంగాణ ప్రభుత్వం


తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగు విధానంను ప్రభుత్వం రద్దు చేసింది. రైతులు నచ్చిన పంట వేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు తెలిపింది.

పంట కొనుగోలు ద్వారా ప్రభుత్వానికి దాదాపుగా రూ.7500 కోట్లు నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. రైతులు తమ పంటను ఇష్టం వచ్చిన చోట అమ్ముకోవచ్చని, కేంద్ర చట్టాలు కూడా రైతులు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయని ప్రభుత్వం పేర్కొన్నది.

ఇక తెలంగాణలోని రైతులకు సీఎం కెసిఆర్ శుభవార్త చెప్పారు ...రేపటి నుంచి రైతులకు సంబంధించిన రైతు బంధు ఆర్ధిక సాయం ప్రారంభించబోతున్నది. దీనికోసం మొత్తం రూ.7515 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయబోతున్నారు...

Tags :
|

Advertisement