Advertisement

  • తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం ...కరోనాతో మరణించిన వైద్యసిబ్బంది కుటుంబాలకు రూ. 25లక్షల ఎక్స్‌గ్రేషియా

తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం ...కరోనాతో మరణించిన వైద్యసిబ్బంది కుటుంబాలకు రూ. 25లక్షల ఎక్స్‌గ్రేషియా

By: Sankar Wed, 02 Sept 2020 11:35 AM

తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం ...కరోనాతో మరణించిన వైద్యసిబ్బంది కుటుంబాలకు రూ. 25లక్షల ఎక్స్‌గ్రేషియా


కరోనాతో మరణించిన వైద్యసిబ్బంది కుటుంబాలకు రూ. 25లక్షల ఎక్స్‌గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాలని నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. మంగళవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో డాక్టర్ల సంఘాలతో ఆయన సమావేశమయ్యారు.డాక్టర్ సంఘాల డిమాండ్లని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు డాక్టర్ల సంఘాలకు తెలిపారు.

కరోనా బారిన పడిన డాక్టర్ లకు నిమ్స్ లో వైద్యసేవలు అందించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అంతేకాకుండా కరోనా బారినపడ్డ డాక్టర్లు,వైద్యసిబ్బంది కి చికిత్స సమయంలో ఆన్ డ్యూటీగా పరిగణిస్తామని ఈటెల పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కరోనాతో మరణించిన వైద్య సిబ్బంది కుటుంబాలకు రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని కేంద్రప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కాగా తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి..తాజాగా రాష్ట్రంలో 2892 పాజిటివ్‌ కేసులు న‌మోద‌వ‌గా, 10 మంది మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1,30,589కు చేర‌గా, క‌రోనా మృతులు 846కు పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల్లో 32341 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 25,271 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు.

Tags :
|

Advertisement