Advertisement

  • కొత్త వైరస్ నేపథ్యంలో అలెర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం...బ్రిటన్ నుంచి వచ్చినవారిపై ఆరా

కొత్త వైరస్ నేపథ్యంలో అలెర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం...బ్రిటన్ నుంచి వచ్చినవారిపై ఆరా

By: Sankar Tue, 22 Dec 2020 4:23 PM

కొత్త వైరస్ నేపథ్యంలో అలెర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం...బ్రిటన్ నుంచి వచ్చినవారిపై ఆరా


బ్రిటన్‌, దక్షిణాఫ్రికాలలో కొత్త రకం కరోనా కేసులు వెలుగుచూడడం కలవరపెడుతున్నది. ఈ నేప‌థ్యంలో కేంద్రంతో పాటు ఆయా రాష్ర్ట ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి.

నిన్న యూకే నుంచి ఏడుగురు ప్ర‌యాణికులు రాగా, వారం రోజుల్లో 358 మంది రాష్ర్టానికి వ‌చ్చార‌ని తెలంగాణ రాష్ర్ట ప్ర‌జారోగ్య సంచాల‌కుడు శ్రీనివాస్ తెలిపారు. న‌వంబ‌ర్ 25 నుంచి రాష్ర్టానికి వ‌చ్చిన వారి వివ‌రాల‌ను సేక‌రిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప్ర‌యాణికుల ఆరోగ్య ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నామ‌ని చెప్పారు.

యూకే నుంచి రాష్ర్టానికి వ‌చ్చిన వారు ఆరోగ్య శాఖ‌కు వీలైనంత త్వ‌ర‌గా తెలుపాల‌న్నారు. యూకే నుంచి వ‌చ్చిన వారిలో క‌రోనా నెగిటివ్ వ‌చ్చినా వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేన‌ని తేల్చిచెప్పారు.

Tags :
|

Advertisement