Advertisement

  • తెలంగాణాలో రేపటి నుంచే ఎంట్రన్స్ టెస్టులు ప్రారంభం ..ఈ సెట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన జేఎన్టీయూ

తెలంగాణాలో రేపటి నుంచే ఎంట్రన్స్ టెస్టులు ప్రారంభం ..ఈ సెట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన జేఎన్టీయూ

By: Sankar Sun, 30 Aug 2020 09:42 AM

తెలంగాణాలో రేపటి నుంచే ఎంట్రన్స్ టెస్టులు ప్రారంభం ..ఈ సెట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన జేఎన్టీయూ


కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో సడలింపులు ఇస్తుండటంతో తెలంగాణాలో తిరిగి ఎంట్రన్స్ పరీక్షలు మొదలవుతున్నాయి..కరోనా కారణంగా వాయిదా పడిన పరీక్షలు ఈసెట్ 2020‌ పరీక్షతో ప్రారంభం కానున్నాయి. పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు బీటెక్‌ సెకండియర్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 31న ఈసెట్‌ నిర్వహించేందుకు జేఎన్‌టీయూ ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఈసెట్‌ పరీక్షను రెండు విడతల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ మంజూర్‌ హుస్సేన్‌ తెలిపారు. అందులో ఉదయం (9 నుంచి 12 వరకు) జరిగే పరీక్షకు 14,415 మంది, మధ్యా హ్నం (3 నుంచి సా. 6 వరకు) జరి గే పరీక్షకు 13,600 మంది హాజరవుతాని తెలిపారు. తెలంగాణలో 56, ఏపీలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు

కరోనా కారణంగా పరిసుఖాకు హాజరు అయ్యే విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు..తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తు, మాస్క్ ధరించాలని తెలిపారు..పరీక్ష సమయం కంటే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు. ఈ విషయాన్ని విద్యార్థుల హాల్‌టికెట్‌పై కూడా ఇచ్చామని.. వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

Tags :

Advertisement