Advertisement

  • వర్షాలకు సర్టిఫికెట్స్ పాడయితే కొత్తవి ఇస్తాము ..విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వర్షాలకు సర్టిఫికెట్స్ పాడయితే కొత్తవి ఇస్తాము ..విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

By: Sankar Wed, 21 Oct 2020 08:47 AM

వర్షాలకు సర్టిఫికెట్స్ పాడయితే కొత్తవి ఇస్తాము ..విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి


రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల చాలా ఇండ్లు నీట మునిగిన ఫలితంగా సర్టిఫికెట్లు పాడైపోయిన వారికి కొత్తవి జారీ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తవి/డూప్లికేట్‌ సర్టిఫికెట్ల కోసం ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో అన్ని రకాల పరీక్షలూ వాయి దా వేసినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ట్విట్టర్‌లో ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి ఆదేశాలతో జేఎన్‌టీయూహెచ్‌లో బుధవారం నుంచి నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశామని ఆ వర్సిటీ రిజిస్ట్రార్‌ మంజూర్‌హుస్సేన్‌ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఉస్మానియా వర్సిటీ పరిధిలో అన్ని పరీక్షలు వాయిదావేశారు. బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో ఈ నెల 21, 22, 23న నిర్వహించాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేశామని వర్సిటీ అధికారులు ప్రకటించారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

Tags :

Advertisement