Advertisement

  • తెలంగాణాలో పాఠశాల సిలబస్ తగ్గింపు పై విద్యాశాఖ కసరత్తు

తెలంగాణాలో పాఠశాల సిలబస్ తగ్గింపు పై విద్యాశాఖ కసరత్తు

By: Sankar Sun, 30 Aug 2020 10:20 AM

తెలంగాణాలో పాఠశాల సిలబస్ తగ్గింపు పై విద్యాశాఖ కసరత్తు


కరోనా కారణంగా అన్ని రాష్ట్రాలలో పాఠశాలలు మూత పడ్డాయి అయిదు నెలలు అవుతున్న కూడా పాఠశాలలు ఎప్పుడు తీర్చుకునేది ఎవ్వరు చెప్పలేని పరిస్థితి...ఒకవేళ పాఠశాలలు త్వరలో ప్రారంభం అయినా ఇప్పటికే కోల్పోయిన కాలాన్ని ఎలా కవర్ చేయాలనీ రాష్ట్రాలు తర్జనభర్జనలు పడుతున్నాయి...అందుకే తెలంగాణ ప్రభుత్వ సిలబస్‌ కుదింపు విషయం మీద విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

తెలంగాణలో జూన్‌ 12 నుంచి మొదలు కావాల్సిన పాఠశాలలు ఇంకా తెరుచుకోనేలేదు. పూర్తిస్థాయిలో ఎప్పుడు ప్రారంభమవుతాయో లేదో ఇప్పటికీ తెలియటటం లేదు. విద్యార్థులు చదువుకు దూరం కాకుండా, ఖాళీగా ఉండకుండా ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభిస్తున్నా..ఎన్ని రోజులపాటు కొనసాగుతాయనేది కూడా అంతుబట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో గతంలో మాదిరిగా ఈసారి పూర్తి సిలబస్‌ను అమలు చేయడం అసాధ్యమని విద్యాశాఖ భావిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే 76 రోజులు గడిచిపోయాయి.

ఈ విద్యా సంవత్సరం వచ్చే ఏప్రిల్‌ వరకు కొనసాగితే మొత్తం 172 పని దినాలే ఉంటాయి. ఈ తరుణంలో 1 నుంచి 10 వరకు అన్ని తరగతులకు సిలబస్‌ కుదించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఏటా 10వ తరగతి విద్యార్థులకు సిలబస్‌ డిసెంబరులో పూర్తిచేసి జనవరిలో రివిజన్‌ చేపట్టాల్సి ఉంటుంది. ఈసారి సిలబస్‌ పూర్తి, రివిజన్‌ లాంటివి జరగాలంటే ఉన్న సిలబస్‌ను తగ్గించడం తప్ప మరో మార్గం లేదని అధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ తరగతులు ఎక్కువ కాలం సాగితే సిలబస్‌ 50 శాతం మేరకు తగ్గించాలని భావిస్తున్నారు. నెల, రెండు నెలల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చి విద్యార్థులు స్కూళ్లకు వస్తే 25-35 శాతం వరకు సిలబస్‌ తగ్గించాలనుకుంటున్నట్టు సమాచారం. దీనికి ప్రభుత్వం అనుమతించినట్టు చెబుతున్నారు.

Tags :

Advertisement