Advertisement

  • ఆన్లైన్ తరగతులపై మేము ఎటువంటి మార్గదర్శకాలు జారీ చెయ్యలేదు ..తెలంగాణ విద్యా శాఖ

ఆన్లైన్ తరగతులపై మేము ఎటువంటి మార్గదర్శకాలు జారీ చెయ్యలేదు ..తెలంగాణ విద్యా శాఖ

By: Sankar Thu, 02 July 2020 4:34 PM

ఆన్లైన్ తరగతులపై మేము ఎటువంటి మార్గదర్శకాలు జారీ చెయ్యలేదు ..తెలంగాణ విద్యా శాఖ



కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో గత నాలుగు నెలలుగా పాఠశాలలు మూత పడ్డాయి ..అయితే కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పట్లో పాఠశాలలు తెరిచే సూచనలు ఉద కనిపించడం లేదు ..అయితే ఈ లాక్ డౌన్ సమయాన్ని కూడా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు వాటి లాభార్జన కోసం వినియోగించుకున్నాయి ..పిల్లలు ఇంటి దగ్గర ఉండటంతో ఆన్లైన్ క్లాస్ల పేరుతో తల్లి తండ్రుల దగ్గర ఫీజు వసూలు చేస్తున్నారని తల్లి తండ్రుల సంఘాలు కోర్టులో పిటిషన్ దాఖలు చేసాయి ..దీనితో హై కోర్ట్ ఆన్లైన్ క్లాసులపై ఎలాంటి మార్గదర్శకాలు ఆరి చేసారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ..

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యం లో పాఠశాలలు పునఃప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ స్ప ష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవే టు, ఎయిడెడ్‌ స్కూల్ తెరిచేందుకు జిల్లాల విద్యాశాఖ అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని ఆదేశించింది..

అదేవిధంగా పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు సంబం ధించి రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చిత్రా రామచంద్రన్‌ బుధవారం ప్రొసీడింగ్‌ జారీచేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రొసీడింగ్‌లో స్పష్టం చేశారు

Tags :
|

Advertisement