Advertisement

తెలంగాణ ఎంసెట్ కీ విడుదల..

By: Sankar Fri, 18 Sept 2020 8:54 PM

తెలంగాణ ఎంసెట్ కీ విడుదల..


తెలంగాణా ఎంసెట్ కీ విడుదల చేశారు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్. ఈ రోజు నుండి ఈ నెల 20 సాయంత్రం 5 గంటల వరకు ఎంసెట్ వెబ్ సైట్ లో కీ అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 9,10,11,14 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకి ఏపీ తెలంగాణ నుంచి 1లక్ష 19వేల 187 మంది విద్యార్థులు హాజరయ్యారు.

కన్వీనర్ గోవర్ధన్ మాట్లాడుతూ నేడు మొత్తం ఎనిమిది ప్రశ్నపత్రాలకు సంబంధించిన ప్రాథమిక కీతోపాటు విద్యార్థుల ఓఎంఆర్‌ పేపర్ స్కానింగ్‌ కాపీలనూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అన్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించి నిపుణుల కమిటీ తుది కీను నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు.

దాని ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తామని అన్నారు. అభ్యర్థులు వివరాలను https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చని ఆయన అన్నారు. అలానే ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్కడే నమోదు చేయవచ్చని పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement