Advertisement

  • హాల్ టికెట్ నెంబర్ తప్పుగా ఎంట్రీ చేసిన వారికి ర్యాంక్‌ ఇవ్వలేదు .. ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్

హాల్ టికెట్ నెంబర్ తప్పుగా ఎంట్రీ చేసిన వారికి ర్యాంక్‌ ఇవ్వలేదు .. ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్

By: Sankar Thu, 08 Oct 2020 4:13 PM

హాల్ టికెట్ నెంబర్ తప్పుగా ఎంట్రీ చేసిన వారికి ర్యాంక్‌ ఇవ్వలేదు .. ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్


కరోనా సమయంలోనూ వివిధ ఎంట్రెస్ట్ టెస్ట్‌లు నిర్వహిస్తూనే ఉన్నారు.. విద్యాసంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నారు.. ఇక, ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ లాసెట్‌ నిర్వహించనున్నారు.. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 ఇయర్స్ లా కోర్స్ కి పరీక్ష జరగనుండగా.. మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు లా పీజీ, 5 ఇయర్స్ కోర్సులకు సంబంధించి ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది. మొత్తం సీట్లు 5,869 ఉండగా.. 30,310 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక, కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఇక, ఎంసెట్ నిర్వహణపై ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్... ఎంసెట్ దరఖాస్తు ఫారం హాల్ టికెట్ తప్పుగా ఎంట్రీ చేసినవారికి ర్యాంక్‌లు ఇవ్వలేదన్నారు. ఎంసెట్ రాంక్స్‌లో ఇంటర్ మార్క్స్ లకు 25 శాతం వెయిటేజ్ ఉంటుందన్న ఆయన.. హాల్ టికెట్ నంబర్ సరి చేసుకోవడానికి పరీక్షకు ముందు అవకాశం ఇచ్చాం.. వారికి సమాచారం కూడా ఇచ్చామని.. చాలా మంది కరెక్షన్ చేసుకున్నారని తెలిపారు.

ఇప్పుడు కూడా హాల్ టికెట్ నంబర్ సరి చేసుకుంటేనే వారికి ర్యాంక్‌లు కేటాయిస్తామని స్పష్టం చేశారు గోవర్ధన్. ఇక, వారికి ర్యాంక్‌లలో ఎలాంటి నష్టం జరగదన్న ఆయన.. ప్రతీ సంవత్సరం ఈ సమస్య వస్తుందని గుర్తుచేశారు.. ఈ రోజు సరి చేసుకున్న వారికి రేపు ఉదయం లోపు ర్యాంక్‌లు ఇస్తామన్నారు. హాల్ టికెట్ నంబర్ సరిచేసుకోవడానికి జేఎన్టీయూకి రావాల్సిన అవసరం లేదని.. ఎంసెట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే సరిపోతుందన్నారు.

Tags :
|

Advertisement