Advertisement

  • అధికారణాన్ని దుర్వినియోగం చేయకూడదు ..ఎస్సై ల పాసింగ్ పరేడ్ లో డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు

అధికారణాన్ని దుర్వినియోగం చేయకూడదు ..ఎస్సై ల పాసింగ్ పరేడ్ లో డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు

By: Sankar Fri, 23 Oct 2020 11:39 AM

అధికారణాన్ని దుర్వినియోగం చేయకూడదు ..ఎస్సై ల పాసింగ్ పరేడ్ లో డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు


తెలంగాణ పోలీస్ అకాడెమీలో పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ పరేడ్ లో 1162 మంది ఎస్సైలు పాల్గొన్నారు. వీరిలో 256 మంది మహిళా ఎస్సైలు ఉండటం విశేషం. పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎస్సైలను ఉద్దేశించి మాట్లాడారు.

తెలంగాణ పోలీస్ శాఖకు ఇది ఒక మంచి పరిణామం అని అన్నారు. తొమ్మిది నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైలకు అయన అభినందనలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో పోలీసులు భాగస్వామ్యం కావాలని అన్నారు. సమాజంలో పోలీస్ వ్యవస్థ అత్యంత కీలకమైనదని డీజీపీ పేర్కొన్నారు. సగర్వంగా ప్రజాసేవకు అంకితం కావడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినట్టు అయన తెలిపారు. నిస్పక్షపాతంగా, నిజాయితీగా, రాగద్వేషాలకు అతీతంగా, చట్టం ప్రకారం విధి నిర్వహణ చేయాలని అన్నారు.

యూనిఫామ్ ఉందని ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయకూడదని, ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే అధికారాన్ని వినియోగించాలని, అధికార దుర్వినియోగం చేయకూడదని అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలగకుండా, హక్కులు అమలు జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు.

Tags :
|

Advertisement