Advertisement

  • తెలంగాణాలో పదివేల కరోనా కేసులు ..ఈ ఒక్కరోజే 891 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణాలో పదివేల కరోనా కేసులు ..ఈ ఒక్కరోజే 891 మందికి కరోనా పాజిటివ్

By: Sankar Wed, 24 June 2020 9:42 PM

తెలంగాణాలో పదివేల కరోనా కేసులు ..ఈ ఒక్కరోజే 891 మందికి కరోనా పాజిటివ్



తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,069 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 891 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,444కు చేరిందని వైద్యారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇవాళ కరోనాతో ఐదుగురు మృతి చెందారు.

దీంతో తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య 225 కు చేరింది. కొత్తగా 137 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,361 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,858 యాక్టివ్‌ కేసులున్నాయి. తెలంగాణవ్యాప్తంగా ఇప్పటివరకు 67,318 మందికి కోవిడ్‌ పరీక్షలు చేశారు. ఇక తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 719 కేసులు, రంగారెడ్డిలో 86, మేడ్చల్‌ జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి.

కాగా వారం క్రితం వరకు కూడా మామూలుగానే ఉన్న కరోనా కేసులు గత వారం రోజులుగా ఒక్కసారిగా తీవ్రతరం అయ్యాయి..రోజుకి 100 కేసుల కానుంచి ఇప్పుడు రోజుకి వెయ్యి కేసులు అయ్యాయి ..దీనితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు అయితే కరోనా టెస్టుల సంఖ్య పెంచడం వల్ల మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా టెస్టులు చేసే అవకాశం ఇవ్వడం వల్ల కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి

Tags :
|
|

Advertisement