Advertisement

  • కాంగ్రెస్ విజన్ 2023... తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇంచార్జీ మాణికం ఠాగూర్

కాంగ్రెస్ విజన్ 2023... తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇంచార్జీ మాణికం ఠాగూర్

By: Sankar Fri, 02 Oct 2020 3:38 PM

కాంగ్రెస్ విజన్ 2023... తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇంచార్జీ మాణికం ఠాగూర్


సీఎం కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఫైర్‌ అయ్యారు. వ్యవసాయ బిల్లుకు నిరసనగా సంగారెడ్డిలో నేతలు ఠాగూర్, ఉత్తమ్, జగ్గారెడ్డి దీక్షలో కూర్చున్నారు.

ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇక్కడి నుండి నామినేషన్ వేసిన చోటు... అందుకే ఇక్కడి నుండి తాను ఇంఛార్జిగా కార్యక్రమాలు మొదలుపెట్టానని పేర్కొన్నారు. 2023లో తెలంగాణలో అధికారంలోకి రావాలని నన్ను ఇక్కడికి పంపించారని.. విజన్ 2023 పేరుతో మనం ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 79 స్థానాలు కాంగ్రెస్ గెలవాలన్నారు.

తెలంగాణలో అన్ని వర్గాలు మేలు జరగాలని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు..కానీ ఆమె కల నెరవేరలేదని తెలిపారు. తెలంగాణలో ప్రతీ పౌరుడికి సాధికారత కావాలని సోనియాగాంధీ కోరుకున్నారు కానీ కేసీఆర్.. ఆయన కొడుకు..అల్లుడు.. బిడ్డ చేతిలోనే అధికారం ఉండిపోయిందని మండిపడ్డారు. నష్టపోయిన అన్ని వర్గాలు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి రావాలని కోరుతున్నానని చెప్పారు.

ఏమీ లేని స్థితి నుండి... కేసీఆర్ అత్యంత ధనికుడు అయ్యారని.. కేసీఆర్.. త్వరలో ముఖేష్ అంబానీ కంటే ధనవంతుడు అయిపోతారని పేర్కొన్నారు. ముఖేష్ వ్యాపారం చేస్తున్నాడు... కేసీఆర్ కమీషన్లు తీసుకుంటున్నారన్నారు. కేసీఆర్ ని కమీషన్ చంద్రశేఖర్ అని పిలుద్దామని తెలిపారు

Tags :

Advertisement