Advertisement

ముగిసిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం

By: Sankar Wed, 09 Dec 2020 9:04 PM

ముగిసిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం


తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం చర్యలు చేపట్టింది ..ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక , జిహెచ్ఎంసి ఎన్నికలలో ఘోర పరాజయాలతో పిసిసి చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసారు ..దీనితో కొత్త పిసిసి చీఫ్ ను ఎన్నుకునే పనిలోపడింది కాంగ్రెస్ ...ఇందుకోసం రేస్ లో ముఖ్యంగా సీనియర్ నేత కోమటి రెడ్డి , రేవంత్ రెడ్డి , జగ్గారెడ్డి వంటి వారు ఉన్నారు ..

ఇక నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ముగిసింది. బుధవారం సాయంత్రం టీ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ మాణికం ఠాగూర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, వీహెచ్‌, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు.

కొత్త పీసీపీ అధ్యక్షుడి ఎంపికపై చర్చించారు. కోర్‌ కమిటీ సభ్యులు తమ తమ అభిప్రాయాలను మాణికం ఠాగూర్‌కు తెలియజేశారు..సమావేశం అనంతరం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి బెస్ట్‌ ఆఫ్‌ లక్ చెప్పారు. అనంతరం​ మీడియాతో మాట్లాడుతూ.. కోర్‌ కమిటీ సమావేశంలో తన అభిప్రాయం చెప్పలేదని, సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటే తనది అదే నిర్ణయం అని చెప్పారు.

Tags :
|

Advertisement