Advertisement

  • తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా శుబాకాంక్షలు చెప్పిన సీఎం కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా శుబాకాంక్షలు చెప్పిన సీఎం కెసిఆర్

By: Sankar Sun, 25 Oct 2020 07:08 AM

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా శుబాకాంక్షలు చెప్పిన సీఎం కెసిఆర్


రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు శనివారం సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ఆడబిడ్డలు తీరొక్కపూలతో బతుకమ్మలు పేర్చి, పాటలకు పాదం కలిపారు. ఎంగిలిపూలతో మొదలైన వేడుకలు సద్దులతో ముగిశాయి. పల్లెలు, పట్టణాలు, నగరాలు పూలవనాల్లాగా మారిపోయాయి.

ఆడబిడ్డలు బతుకమ్మలను నిమజ్జనం చేసి, వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కుటుంబ సభ్యులతో సద్దులు ఆరగించి, ఇంటిబాటపట్టారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ ఆడిన ఆడబిడ్డలు.. వచ్చే ఏడాదికల్లా మహమ్మారి కనిపించకుండా పోవాలని గౌరమ్మను వేడుకున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రావణుడిపై రాముడు సాధించిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి అని తెలిపారు.

రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో సుసంపన్నమైన జీవితం గడిపేలా ఆశీర్వదించాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నానన్నారు. కరోనా మహమ్మారి అంతం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అందరూ కొవిడ్‌ నిబంధనలను పక్కాగా పాటిస్తూ పండుగ జరుపుకోవాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను కోరారు.

ఇక కరోనా నేపథ్యంలో మనమంతా కలిసి జరుపుకోలేకపోయినా..బతుకమ్మకు దూరం కాలేదని ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆమె తయారు చేసిన బతుకమ్మ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఏడాది బతుకమ్మ విభిన్నమని, అయితే సామాజిక మాధ్యమాలు మనందరిని దగ్గర చేశాయని చెప్పారు. ప్రియమైన తల్లులు, అక్కచెల్లెళ్లు బతుకమ్మను ఎలా జరుపుకుంటున్నారో చూడాలని ఉందన్నారు. ‘నాబతుకమ్మ.. నాకెంతోగర్వం’ అన్న హ్యాష్‌ ట్యాగ్‌తో బతుకమ్మ ఫొటోలను కవిత షేర్‌ చేశారు.

Tags :
|
|
|
|

Advertisement