Advertisement

  • అమర జవాన్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన కెసిఆర్ ..

అమర జవాన్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన కెసిఆర్ ..

By: Sankar Mon, 22 June 2020 5:15 PM

అమర జవాన్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన కెసిఆర్ ..



చైనా ఇండియా మధ్య సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో ప్రాణాలు వదిలి అమరుడు అయినా వీర జవాన్ సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సూర్యాపేటకు వచ్చి పరామర్శించారు .. సోమవారం రోడ్డు మార్గంలో సూర్యాపేట, విద్యానగర్‌లో ఉన్న సంతోష్‌బాబు నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతోష్‌బాబు తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్‌, భార్య సంతోషిని పరామర్శించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5 కోట్ల రూపాయల చెక్‌, సంతోషికి గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగానికి సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు. అలాగే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కేటాయించిన ఇంటిస్థలం పత్రాలను కూడా సీఎం, సంతోష్‌బాబు కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 కోట్లలో 4 కోట్ల రూపాయల చెక్‌ను సంతోష్‌బాబు భార్య సంతోషికి, కోటి రూపాయల చెక్‌ను ఆయన తల్లిదండ్రులకు అందించారు. సీఎం వెంట విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సంతోష్‌బాబు నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు..

ఈ సందర్భంగా సంతోష్ బాబు తల్లిదండ్రులు, భార్య, పిల్లలు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి తాము రుణపడి ఉంటానని సంతోషి ఉద్వేగానికి లోనయ్యారు. నచ్చిన శాఖలో ఉద్యోగంలో చేరామని చెప్పారన్నారు. కేసీఆర్ తనను ఇంటికి కూడా ఆహ్వానించారని సంతోషి తెలిపారు. సూర్యాపేటలోని కోర్టు ఏరియాలో ఉన్న చౌరస్తాలో సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. దానికి సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేస్తామన్నారు.

Tags :
|
|
|

Advertisement