Advertisement

  • పివి నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలి ..కెసిఆర్

పివి నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలి ..కెసిఆర్

By: Sankar Sun, 28 June 2020 3:07 PM

పివి నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలి ..కెసిఆర్



దివంగత మాజీ ప్రధాని తెలంగాణ వాసి పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రారంభించారు ..ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతు పీవీ నరసింహారావు గారు దేశానికి ప్రధానిగా ఎంతో సేవ చేసారు ఆయన సేవలకు తగిన గుర్తింపు లభించలేదు అందుకే అయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు భారత రత్న ఇవ్వాలని తెలంగాణ ప్రజలందరి తరుపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపాడు ..దీనికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి, పీవీ కుటుంబసభ్యులు, రాష్ట్ర మంత్రి వర్గంతో కలిసి ప్రధాని మోదీని తాను కలుస్తానని కేసీఆర్ చెప్పారు.

ఇక హైదరాబాద్ యూనివర్సిటీకి (హెచ్‌సీయూ) పీవీ నరసింహారావు పేరు పెట్టేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రధానికి కూడా తాను ఈ రోజే లేఖ రాస్తానని వెల్లడించారు. ‘‘అంతేకాక, తెలుగు అకాడమీకి పీవీ నరసింహారావు పేరు పెడతాం. పీవీ గుర్తింపునకు మంచి మెమోరియల్ ఏర్పాటు చేస్తాం. రామేశ్వరంలో అబ్దుల్ కలాం లాంటి మెమోరియల్‌ను అధ్యయనం చేసి, ఇదే స్థలంలో వచ్చే జూన్ 28 లోపు ఇక్కడే మోమోరియల్ ఏర్పాటు చేయాలి. ఇంకా కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు పీవీ పేరు పెట్టాలని అనుకుంటున్నాం.’’ అని కేసీఆర్ ప్రకటించారు.

ప్రధాని మోదీ, రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతులు కూడా పీవీ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేలా కార్యక్రమాలను రూపొందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే పీవీ 5 కాంస్య విగ్రహాలు ఆర్డర్ ఇచ్చామని, వాటిని కరీంనగర్, వరంగల్, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లోనూ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలోనూ పీవీ చిత్రపటాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పార్లమెంటులోనూ ఆయన ఫోటోను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు

Tags :
|
|

Advertisement