Advertisement

  • కరోనా నేపథ్యంలో తెలంగాణాలో బడ్జెట్ పై మధ్యంతర రివ్యూ ..

కరోనా నేపథ్యంలో తెలంగాణాలో బడ్జెట్ పై మధ్యంతర రివ్యూ ..

By: Sankar Fri, 23 Oct 2020 10:12 PM

కరోనా నేపథ్యంలో తెలంగాణాలో బడ్జెట్ పై మధ్యంతర రివ్యూ ..


ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్.. ఆర్థిక‌రంగాన్ని తీవ్ర‌స్థాయిలో దెబ్బకొట్టింది... దేశాలు, రాష్ట్రాలు అనే తేడా లేకుండా అన్ని చ‌తికిల‌ప‌డిపోయిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.. ఈ నేప‌థ్యంలో 2020-21 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్..

కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గింది.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడింది.. కేంద్ర జీడీపీ కూడా మైనస్ 24 శాతానికి పడిపోయింద‌ని పేర్కొన్న సీఎం కేసీఆర్.. దీని ప్రభావం రాష్ట్రాలపై కూడా పడుతుంది.

ఈ పరిస్థితుల నేపథ్యంతో వాస్తవానికి ఎన్ని నిధులు అందుబాటులో ఉంటాయో అంచనా వేయాలి.. ఏఏ శాఖలకు ఎన్ని నిధులు విడుదల చేసే వెసులుబాటు ఉంటుందో నిర్ణయించాల‌ని సూచించారు.. దీని కోసం మొత్తం బడ్జెట్ పై సమీక్ష నిర్వహించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల‌ని అని కీల‌క ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.

Tags :
|

Advertisement