Advertisement

  • పార్లమెంటు సమావేశాలకు హాజరుకాని తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్

పార్లమెంటు సమావేశాలకు హాజరుకాని తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్

By: chandrasekar Wed, 16 Sept 2020 07:45 AM

పార్లమెంటు సమావేశాలకు హాజరుకాని తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్


సోమవారం నుండి పార్లమెంటు సమావేశాలు ప్రాంభమైన విషయం తెలిసిందే. కానీ తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ సమావేశాలకు హాజరు కాలేదు. కోవిడ్ ప్రభావం కారణంగా తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలకు దూరమయ్యారు. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు నాలుగు రోజుల క్రితం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు.

గత సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీలందరికీ సమావేశాలకు ముందు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా బండి సంజయ్ కూడా కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌గా నిర్ధారణ జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు బీజేపీ పార్టీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కృష్ణదాస్‌తో బండి సంజయ్ సమావేశమయ్యారు. పార్లమెంటులో చర్చించాల్సిన విషయాల గురించి వీరు ప్రస్తావించినట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కృష్ణదాస్‌కు నిర్వహించిన వైద్యపరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా బండి సంజయ్ ఐదు రోజుల పాటు స్వీయ క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు పార్లమెంటు సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఈ కారణంతో సమావేశాలకు హాజరుకాలేకపోతున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి బండి సంజయ్ సమాచారం అందించారు. ఐదు రోజుల క్వారంటైన్ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి కోవిడ్ నెగటివ్‌‌గా నిర్థారించుకుని పార్లమెంటు సమావేశాలకు ఆయన హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సమావేశాలకు హాజరయ్యే ప్రతిఒక్కరు వైద్య పరీక్షలు చేసుకోవాలని కేంద్ర నిర్ణయించింది.

Tags :

Advertisement