Advertisement

  • డీజీపీ మహేందర్రెడ్డి పై తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ ఫైర్...!

డీజీపీ మహేందర్రెడ్డి పై తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ ఫైర్...!

By: Anji Mon, 30 Nov 2020 12:54 PM

డీజీపీ మహేందర్రెడ్డి పై తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ ఫైర్...!

తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ డీజీపి మహేందర్రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్, డీజీపీ పోషించాల్సిన పాత్రకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులకు మడుగులు వత్తుతున్నారని ఆయన అన్నారు.

బిజేపి రోడ్ షోలు విజయవంతమయ్యాయని.. కేసీఆర్ సభ విఫలమవ్వడం వల్ల భయం పట్టుకుందన్నారు. అడ్డదారిలో గెలవాలని ఉద్దేశంతో రాత్రికి రాత్రే నగదు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.

మైలార్దేవ్పల్లిలో ఎమ్మెల్యే, సీఐ డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు చేసినా కేసునమోదు చేయలేదని మండిపడ్డారు. డబ్బులు పంచుతున్న తెరాస కార్యకర్తలను అడ్డుకుంటున్న బీజేపి కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారని... దాడులకు ప్రతి దాడులు చేస్తామని బండి హెచ్చరించారు.

డీజీపీ మహేందర్రెడ్డి దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. పోలీసు వ్యవస్థను చూసి ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
శాంతిభద్రతల సమస్యను కొని తెచ్చుకోకుండా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగేలా... ఎన్నికల కమిషన్, పోలీసులు సహకరించాలని కోరారు.

Tags :

Advertisement