Advertisement

  • కరోనా కేసుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు ..ఒక్క రోజు కేసుల్లో వెయ్యికి చేరువయిన హైదరాబాద్

కరోనా కేసుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు ..ఒక్క రోజు కేసుల్లో వెయ్యికి చేరువయిన హైదరాబాద్

By: Sankar Fri, 03 July 2020 10:06 AM

కరోనా కేసుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు ..ఒక్క రోజు కేసుల్లో వెయ్యికి చేరువయిన హైదరాబాద్



తెలంగాణాలో కరోనా టెస్టులు తీవ్ర రూపం దాల్చింది ..రోజు , రోజుకి కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి ..టెస్టులు పెరిగే కొద్దీ కేసులు కూడా పెరుగుతున్నాయి ..తాజాగా తెలంగాణాలో ఒక్కరోజు కరోనా కేసుల్లో గురువారం రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి ..మొత్తం 1213 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,570కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 9,226గా ఉన్నాయి. గత 24 గంటల్లో 987 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 9,069కు చేరింది. ఇక గురువారం మరో ఎనిమిది మంది కరోనాకు బలి కాగా, మొత్తం సంఖ్య 275కి చేరింది.

ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే పెద్ద ఎత్తున 998 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో ఉంది. అక్కడ 54 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 48 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో ఖమ్మం జిల్లా ఉంది. ఇక్కడ 18 కేసులు నమోదయ్యాయి.

ఇక వరంగల్ రూరల్ జిల్లాలో 10 కేసులు, వరంగల్ అర్బన్‌లో 9, నల్గొండ 8, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, భద్రాద్రి జిల్లాల్లో 7, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6, కరీంనగర్, మహబూబాబాద్‌, నిజామాబాద్ జిల్లాల్లో 5 కేసులు, సూర్యాపేట, ములుగు, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో 4, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో 2, గద్వాల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కోకేసు చొప్పున కరోనా కేసులను గుర్తించారు.

Tags :
|
|
|
|

Advertisement