Advertisement

సొంత చెల్లెలిని తుపాకీతో కాల్చి చంపిన అన్న

By: Sankar Fri, 20 Nov 2020 8:15 PM

సొంత చెల్లెలిని తుపాకీతో కాల్చి చంపిన అన్న


టీనేజ్ యువతిని ఆమె సోదరుడే తుపాకీతో కాల్చిన అమానుష ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. నగరంలోని వెల్‌కమ్ ప్రాంతానికి చెందిన టీనేజ్ యువతి నిత్యం ఫోన్‌లో బిజీగా ఉంటోంది.

మగపిల్లలతో వాట్సాప్ కాల్స్, చాటింగ్ చేసేది. ఆ విషయం ఆమె అన్న(17)కి తెలియడంతో తీవ్రంగా మందలించాడు. మగపిల్లలతో చాటింగ్ చేయొద్దని వారించాడు. అయినా ఆమె పద్ధతి మార్చుకోకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు.మరోమారు చెల్లెలు తన స్నేహితుడితో చాటింగ్ చేస్తూ కనిపించడంతో అన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

ఎంత చెప్పినా వినడం లేదంటూ ఆమెతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కోపంతో ఊగిపోయాడు. ఆవేశంలో ఘాతుకానికి తెగబడ్దాడు. చెల్లెలిని తుపాకీతో కాల్చేశాడు. బుల్లెట్లు ఆమె కడుపులో నుంచి దూసుకుపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

వెంటనే తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కడుపులో నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్రగాయాలపాలైంది. ఆస్పత్రి వర్గాలు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని అరెస్టు చేసి కటకటాలవెనక్కి నెట్టారు

Tags :
|
|

Advertisement