Advertisement

  • భారత్ లో టెక్నో స్పార్క్ పవర్ 2 స్మార్ట్ ఫోన్ లాంచ్

భారత్ లో టెక్నో స్పార్క్ పవర్ 2 స్మార్ట్ ఫోన్ లాంచ్

By: chandrasekar Thu, 18 June 2020 12:17 PM

భారత్ లో టెక్నో స్పార్క్ పవర్ 2 స్మార్ట్ ఫోన్ లాంచ్


మనదేశంలో టెక్నో స్పార్క్ పవర్ 2 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. 7 అంగుళాల భారీ డిస్ ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్ ను కూడా ఇందులో అందించారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ గా ఉంది. టెక్నో స్పార్క్ పవర్ 2 స్మార్ట్ ఫోన్ లో ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్ ను అందించారు. అలాగే వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా అందించారు.

దీనిలో కేవలం 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.9,999గా నిర్ణయించారు. ఫ్లిప్ కార్ట్ లో ఇది అందుబాటులో ఉండనుంది. దీనికి సంబంధించిన సేల్ జూన్ 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఐస్ జేడైట్, మిస్టీ గ్రే రంగుల్లో ఇది లాంచ్ అయింది.

టెక్నో స్పార్క్ పవర్ 2 స్మార్ట్ ఫోన్ లో 7 అంగుళాల హెచ్ డీ+ వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20.5:9గా ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో 90.6 శాతంగా ఉండగా, బ్రైట్ నెస్ 480 నిట్స్ గా ఉంది. మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.

techno spark,power 2,smart phone,launches,in india ,భారత్ లో, టెక్నో స్పార్క్ ,పవర్ 2, స్మార్ట్ ఫోన్, లాంచ్


4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ గా ఉంది. దీంతో పాటు వైడ్ యాంగిల్ లెన్స్, మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి, ముందువైపు 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

ఇందులో 18W ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేసే 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే నాలుగు రోజుల బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 376 గంటల స్టాండ్ బై, 37 గంటల కాలింగ్, 16 గంటల పాటు ఇంటర్నెట్ ఉపయోగించవచ్చని, 155 గంటల పాటు సంగీతం వినవచ్చని, 13 గంటల పాటు గేమ్స్ ఆడవచ్చని, 14 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ చూడవచ్చని కంపెనీ పేర్కొంది. బ్లూటూత్ వీ5, వైఫై 802.11 b/g/n/ac, 4జీ ఎల్టీఈ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Tags :

Advertisement