Advertisement

  • టెక్నో స్పార్క్ గో 2020 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్

టెక్నో స్పార్క్ గో 2020 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్

By: chandrasekar Wed, 02 Sept 2020 10:16 PM

టెక్నో స్పార్క్ గో 2020 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్


మనదేశంలో టెక్నో స్పార్క్ గో 2020 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లేను ఇందులో అందించారు. మీడియాటెక్ హీలియో ఏ20 ప్రాసెసర్ కూడా ఇందులో ఉంది. వెనకవైపు రెండు కెమెరాలను దీనిలో అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 13 మెగా పిక్సెల్ సెన్సార్ ను అందించారు. ఈ ఫోన్ కేవలం ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే అందుబాటులో ఉండనుంది.

టెక్నో స్పార్క్ గో 2020 ధర


దీనిలో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.6,499గా నిర్ణయించబడింది. ఐస్ జాడైట్, ఆక్వా బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ సేల్ జరగనుంది.

స్పెసిఫికేషన్లు


ఈ స్మార్ట్ ఫోన్ లో 6.52 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. 1.8 గిగాహెర్ట్జ్ మీడియాటెక్ హీలియో ఏ20 ప్రాసెసర్ ను దీనిలో అందించారు. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ను ఇందులో అందించారు. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. వెనకవైపు దీనిలో రెండు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, మరో ఏఐ లెన్స్ కూడా ఉంది. డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్, బొకే, ఏఐ బ్యూటీ, ఏఎస్ డీ, హెచ్ డీఆర్ వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి.

ఇక ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది. 15.6 గంటల పాటు గేమింగ్ లేదా 24 గంటల పాటు కాలింగ్ లేదా 36 రోజుల స్టాండ్ బైను ఈ ఫోన్ ఒక పూర్తి చార్జ్ తో అందించనుంది. 4జీ వోల్టే, బ్లూటూత్, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, యూఎస్ బీ ఓటీజీ వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి. జీ-సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Tags :

Advertisement