Advertisement

బడ్జెట్ ధరలో టెక్నో స్పార్క్ 6 గో

By: chandrasekar Wed, 23 Dec 2020 09:58 AM

బడ్జెట్ ధరలో టెక్నో స్పార్క్ 6 గో


బడ్జెట్ ధరలో టెక్నో స్పార్క్ 6 గో మొబైల్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనకవైపు అందించారు. ఈ ఫోన్ లో ఒకే ఒక్క వేరియంట్ అందుబాటులో ఉంచింది. దీనిలో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో రానున్న ఈ వేరియంట్ ధర రూ.8,699గాను ప్రస్తుతం ప్రారంభ ఆఫర్ కింద రూ.8,499కే లభించనుంది. ఈ ఫోన్ సేల్ ఫ్లిప్ కార్ట్‌లో డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే ఆఫ్ లైన్‌లో వచ్చే జనవరి 7 తేదీ నుండి లభించనుంది.

స్పెసిఫికేషన్ వివరాలు:

* ఈ ఫోన్ లో 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. దీనిలో యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది.

* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఏ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

* ఇందులో 4 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.

* వెనుక వైపు కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ గాను మరియు ఏఐ లెన్స్ కూడా అందించారు. ఏఐ హెచ్‌డీఆర్, ఏఐ బ్యూటీ, బొకే మోడ్, ఆటో సీన్ డిటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

* సెల్ఫీ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

* ఇందులో స్టోరేజ్ సామర్థ్యం 64 జీబీ కాగా, దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

* ఈ ఫోన్ లో వాటర్ డ్రాప్ నాచ్ ఉన్న డిస్ ప్లేను అందించారు.

* ఈ ఫోన్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు.

* యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మాగ్నెట్ మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి.

* ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఇందులో అందించారు.

* ఇందులో బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. దీని మందం 0.91 సెంటీమీటర్లుగానూ, బరువు 193 గ్రాములుగానూ ఉంది.

* ఈ ఫోన్ ఆక్వా బ్లూ, ఐస్ జాడైట్, మిస్టరీ వైట్ రంగుల్లో లభించనుంది.

* మొదటి 100 రోజుల్లో ఈ ఫోన్‌కు వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను ఆఫర్ చేశారు.

Tags :
|
|

Advertisement