Advertisement

  • నా కూతురును హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారు .టెక్కీ లావణ్య తండ్రి

నా కూతురును హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారు .టెక్కీ లావణ్య తండ్రి

By: Sankar Sun, 28 June 2020 9:22 PM

నా కూతురును హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారు .టెక్కీ లావణ్య తండ్రి



తెలంగాణాలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ లావణ్య ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి .. లావణ్య భర్త పైలట్‌ వెంకటేశ్వర్‌రావుకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉండటమే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరో మహిళతో వెంకటేశ్వర్‌రావు ఉండగా.. లావణ్యకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దీంతో లావణ్య అతడిని నిలదీసింది. అయితే ఆ తర్వాత నుంచి వెంకటేశ్వర్‌రావు మరింతగా రెచ్చిపోయాడు. ఇంట్లో ఉండే ఆ మహిళతో సోషల్‌ మీడియాలో చాటింగ్‌ చేయడంతో పాటు.. లావణ్య ముందే ఆమెకు వీడియో కాల్స్‌ చేసి మాట్లాడేవాడు

దీంతో లావణ్య తనకు అన్యాయం చేయవద్దని ఆ మహిళను వేడుకున్నారు. మరోవైపు తీరు మార్చుకోని వెంకటేశ్వర్‌రావు.. లావణ్యపై భౌతిక దాడులకు పాల్పడ్డాడు. గర్భవతి అనికూడా చూడకుండా భర్త తనపై దాడి చేయడంతో లావణ్య మరింత ఉద్వేగానికి లోనయ్యారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అసలు రూపం తెలుసుకుని మనస్తాపం చెందారు.

ఈ క్రమంలో లావణ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో లావణ్య మృతికి సంబంధించి మరో మహిళ పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు కూడా సేకరించినట్టుగా సమాచారం. మరోవైపు తమ కూతురిని వెంకటేశ్వర్‌రావు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు.

Tags :
|
|

Advertisement