Advertisement

  • భారత్ పై ప్రశంసల వర్షం కురిపించిన టెక్ దిగ్గజం బిల్ గేట్స్

భారత్ పై ప్రశంసల వర్షం కురిపించిన టెక్ దిగ్గజం బిల్ గేట్స్

By: Sankar Wed, 09 Dec 2020 3:51 PM

భారత్ పై ప్రశంసల వర్షం కురిపించిన టెక్ దిగ్గజం బిల్ గేట్స్


మైక్రో సాఫ్ట్ అధినేత , దిగ్గజ బిజినెస్ మ్యాన్ బిల్ గేట్స్ భారత్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు..వినూత్న ఆర్థిక విధానాలను అవలంభించడంలో ఇండియా మిగతా దేశాల కంటే ముందు నిలిచిందన్నారు.

అంతేగాక అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను భారత్ చక్కగా వినియోగిస్తోందని, ఒకవేళ చైనాను వదిలేసి మరో దేశంపై అధ్యయనం చేయాలనుకునే ప్రపంచ దేశాలు ఏవైనా తప్పనిసరిగా ఇండియాను ఎంచుకోవాలని ఆయన సూచించారు.

ఇక 2016లో పెద్ద నోట్ల రద్దు తరువాత భారత్‌లో డిజిటల్ చెల్లింపులు ఎంతో పెరిగాయని, అవినీతిని నిర్మూలనకు తీసుకున్న ఈ నిర్ణయంతో దేశం మొత్తం నగదు రహితంగా మార్చేందుకు సహకరించిందని పేర్కొన్నారు. నోట్ల రద్దు వల్ల యూనిఫైడ్ పేమెంట్స్, ఇంటర్ ఫేస్ సేవలు విస్తరించాయని తెలిపారు. వైర్‌లెస్ డేటా రేట్లు ప్రపంచంలోనే అతి తక్కువగా ఉన్నది కూడా ఇండియాలోనేనని ఆయన గుర్తు చేశారు.

కాగా కరోనా విజృంభణ తర్వాత ప్రపంచ లోని పెద్ద పెద్ద కంపెనీలు అన్ని చైనా వైపు చూడటం లేదు ..కరోనా వైరస్ చైనాలోనే సృష్టించబడింది అని భావిస్తున్న తరుణం లో చాల కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నాయి..దీనితో ప్రస్తుతం బిల్ గార్టెన్ చేసిన వాక్యలు సంచలనం రేపుతున్నాయి...

Tags :
|

Advertisement