Advertisement

  • ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ..రెండవ స్థానానికి ఎగబాకిన కెప్టెన్ కోహ్లీ

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ..రెండవ స్థానానికి ఎగబాకిన కెప్టెన్ కోహ్లీ

By: Sankar Tue, 15 Dec 2020 6:02 PM

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ..రెండవ స్థానానికి ఎగబాకిన కెప్టెన్ కోహ్లీ


ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ తన రెండవ స్థానాన్ని మల్లి దక్కించుకున్నాడు ...వెస్ట్ ఇండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో రెండవ టెస్ట్ లో విలియమ్సన్ బరిలోకి దిగకపోవడంతో రెండవ స్థానం నుంచి మూడవ స్థానంకు పడిపోయాడు ...ఇక ఇదే సమయంలో మ్యాచ్ ఆడకుండానే కోహ్లీ రెండవ స్థానానికి చేరుకున్నాడు...ఇక స్టీవ్ స్మిత్ తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు...

ఇక టీంఇండియా టెస్ట్ ఆటగాళ్లు పుజారా , రహానే వరుసగా ఏడు , పదవ ర్యాంక్ లను దక్కించుకున్నారు..టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ ఒక స్థానాన్ని మెరుగుపరచుకొని పదో స్థానంలో నిలిచాడు. ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ పాట్‌ కమిన్స్‌ నంబర్‌వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

ఇక న్యూజిలాండ్ జట్టు వెస్ట్ ఇండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేయగా , ఇంకో మూడు రోజుల్లో ఇండియా , ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది..ఇక టీం ర్యంకింగ్స్ విషయానికి వస్తే 116 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా , అదే 116 పాయింట్లతో కివీస్ రెండవ స్థానంలో ఉంది..ఇక టీమిండియా 114 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది..

Tags :

Advertisement