Advertisement

అరంగేట్ర మ్యాచ్ లో అదరగొట్టిన సిరాజ్

By: Sankar Sat, 26 Dec 2020 3:44 PM

అరంగేట్ర మ్యాచ్ లో అదరగొట్టిన సిరాజ్


తన తండ్రి చనిపోయిన కూడా దేశం కోసం ఆడటమే ప్రథమ విధిగా భావించి తన తండ్రి అంత్యక్రియలకు దూరమయిన హైదెరాబాదీ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ మెల్బోర్న్ లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో రాణించాడు..కీల‌క‌మైన రెండు వికెట్లు తీసి .. ఆస్ట్రేలియాను క‌ట్ట‌డి చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. రెండు వికెట్లు తీయ‌డ‌మే కాదు.. రెండు అద్భుత‌మైన క్యాచ్‌ల‌ను కూడా అందుకున్నాడు..

ఆటోరిక్షా డ్రైవ‌ర్ కుమారుడైన సిరాజ్‌.. టీమిండియా త‌ర‌పున హైదరాబాద్ నుంచి ఆడిన రెండ‌వ ఫాస్ట్ బౌల‌ర్‌. గ‌తంలో ఇండియా త‌ర‌పున స‌య్యిద్ అబిద్ అలీ టీమిండియా త‌ర‌పున ఫాస్ట్ బౌల‌ర్‌గా ఆడాడు. అబిద్ అలీ 1966లో అడిలైడ్‌లో టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అత‌ను 55 ప‌రుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. టీమిడియా త‌ర‌పున టెస్టుల‌కు ఆడుతున్న 298వ ప్లేయ‌ర్‌గా సిరాజ్ నిలిచాడు...

ఇక ఈ మ్యాచ్ లో 15 ఓవ‌ర్లు వేసిన సిరాజ్ నాలుగు మెడిన్లు వేసి 40 ప‌రుగులు ఇచ్చాడు. ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడు అయినా లాబుషెన్ వికెట్ తో పాటు కొత్త ఆటగాడు గ్రీన్ వికెట్లను సిరాజ్ తన కాతాలో వేసుకున్నాడు...

Tags :
|

Advertisement