Advertisement

  • రాణించిన బ్యాట్సమెన్ ...సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా

రాణించిన బ్యాట్సమెన్ ...సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా

By: Sankar Sun, 06 Dec 2020 6:06 PM

రాణించిన బ్యాట్సమెన్ ...సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా


ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. రెండో టీ20లో కూడా విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఫలితంగా వన్డే సిరీస్‌ కోల్పోయిన దానికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది...

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది...కెప్టెన్ ఫించ్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేప్పట్టిన వేడ్ ఓపెనర్ గా వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ...ఆ తర్వాత స్మిత్ , మాకిస్వేల్ కూడా ధాటిగా ఆడటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది..దీనితో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు చేసింది...భారత బౌలర్లలో నటరాజన్‌ 2, చహల్‌, ఠాకూర్‌లు చెరో వికెట్‌ తీశారు..

ఇక 195 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఇన్నింగ్స్ లో కె ఎల్ రాహుల్ , ధావన్ , కోహ్లీ , పాండ్య రాణించడంతో ఇంకో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది...భారత ఇన్నింగ్స్లో శిఖర్‌ ధావన్‌(52; 36 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌(30; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి(40; 24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా(42 నాటౌట్‌; 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(12 నాటౌట్‌; 5 బంతుల్లో 1 ఫోర్‌, 1సిక్స్‌) లు ణించి జట్టును గెలిపించారు.

Tags :
|
|

Advertisement