Advertisement

చారిత్రాత్మక విజయం సాధించిన టీమిండియా ..

By: Sankar Tue, 29 Dec 2020 10:12 AM

చారిత్రాత్మక విజయం సాధించిన టీమిండియా ..


మెల్‌బోర్న్ టెస్ట్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. మూడోరోజు ఆట ముగిసే సమయానికి కీలకమైన ఆరు వికెట్లను కోల్పోయి 133 పరుగులు చేయగా.. నాల్గో రోజు ఆట ప్రారంభించిన ఆతిథ్య ఆసీస్ జట్టు 67 పరుగులు సాధించి మిగత నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు ఆలౌట్ అయ్యింది..

ఇక, 70 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ముందు పెట్టింది... 70 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.. శుభ్‌మన్ గిల్(35 నాటౌట్), రహానే(27 నాటౌట్) పరుగులతో భారత్‌ను గెలిపించారు.

దీంతో.. అడిలైడ్ టెస్ట్‌లో దారుణంగా ఓడిపోయిన భార‌త్ ఇప్పుడు అందుకు త‌గ్గ ప్రతీకారం తీర్చుకుంది. ఆతిథ్య జ‌ట్టు ఆప‌సోపాలు ప‌డ్డ పిచ్‌పై మ‌న బౌల‌ర్స్‌, బ్యాట్స్‌మెన్స్ అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌రిచి ఎనిమిది వికెట్ల తేడాతో రెండో టెస్ట్‌లో ఘ‌న విజయం సాధించారు.

Tags :
|
|

Advertisement