Advertisement

  • అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో కుంబ్లే సరసన చేరిన బుమ్రా

అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో కుంబ్లే సరసన చేరిన బుమ్రా

By: Sankar Tue, 29 Dec 2020 1:56 PM

అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో కుంబ్లే సరసన చేరిన బుమ్రా


ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ లో టీమిండియా సంచలనం విజయం సాధించింది ...ఆస్ట్రేలియా సొంత గడ్డపై కోహ్లీ , ఇషాంత్ , షమీ , రోహిత్ వంటి స్టార్ ఆటగాళ్లు లేకున్నా కూడా టీమిండియా సమష్టి ప్రదర్శనతో రాణించింది..ముఖ్యంగా బౌలర్లు టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు...ముఖ్యంగా బుమ్రా తన పదునైన బంతులతో ఆస్ట్రేలియా బాట్స్మెన్ ను ముప్పుతిప్పలు పెట్టాడు..

చివరిసారి భారత్ అక్కడ మ్యాచ్ ఆడినప్పుడు బుమ్రా ఒక్క ఇన్నింగ్స్ లో 6 వికెట్లు సాధించాడు. ఆ మ్యాచ్ లో మొత్తం 9 వికెట్లు తీసాడు. అయితే ఇప్పుడు తాజాగా జరిగిన మ్యాచ్ లో బుమ్రా మొత్తం 6 వికెట్లు తీయడంతో మొత్తం 15 వికెట్లను తన ఖాతాలో వేసుకొని భారత స్టార్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే సరసన నిలిచాడు. కుంబ్లే కూడా మెల్‌బోర్న్ స్టేడియంలో మొత్తం 15 వికెట్లు తీసాడు.

అయితే ఈ తాజాగా జరిగిన మ్యాచ్ లో ఆసీస్ రెండు ఇన్నింగ్సుల్లో 195, 200 పరుగులు చేయగా భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 326 పరుగులు చేసింది. దాంతో భారత్ కు రెండో ఇన్నింగ్స్ లో విజయానికి 70 పరుగులు అవసరం కాగా 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది

Tags :
|
|
|

Advertisement