Advertisement

  • ఆస్ట్రేలియా టూర్ లో సాధన ప్రారంభించిన భారత క్రికెటర్లు

ఆస్ట్రేలియా టూర్ లో సాధన ప్రారంభించిన భారత క్రికెటర్లు

By: Sankar Sun, 15 Nov 2020 2:29 PM

ఆస్ట్రేలియా టూర్ లో సాధన ప్రారంభించిన భారత క్రికెటర్లు


కరోనా తర్వాత టీమిండియా ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్‌కు సిద్ధమైంది. ఐపీఎల్ తర్వాత యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

నవంబర్‌ 27 నుంచి ప్రారంభంకానున్న ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత ఆటగాళ్ల అందరికీ కరోనా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. దీంతో ఆస్ట్రేలియా సిరీస్‌కు ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

సిడ్నీలోని బ్లాక్‌టౌన్‌ ఇంటర్నేషనల్‌ స్పోర్ట్స్‌ పార్క్‌లో సన్నద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో పేర్కొంది. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు పోస్ట్ చేసింది బీసీసీఐ. అంతేగాక ఆటగాళ్లు జిమ్‌ చేస్తున్న ఫొటోలను కూడా ట్వీట్‌ చేసింది. ఫొటోల్లో హార్దిక్ పాండ్య, పృథ్వీ షా, మహ్మద్‌ సిరాజ్‌, కుల్‌దీప్ యాదవ్‌, ఉమేశ్‌ యాదవ్‌, నటరాజన్‌, శార్దూల్ ఠాకూర్‌, పుజారా ఉన్నారు. ఆస్ట్రేలియా గడ్డపై లిమిటెడ్ క్రికెట్లో టీమిండియాకు ఇబ్బందులు ఉండకపోవచ్చు.ఎందుకంటే భారత క్రికెటర్లందరూ ఐపీఎల్‌లో సత్తా చాటి ఫామ్‌లో ఉన్నారు.

Tags :

Advertisement