Advertisement

  • మొదటి మ్యాచ్ల్లోనే ఏకంగా 14 సిక్సులు కొట్టిన టీం ఇండియా పేస్ బౌలర్

మొదటి మ్యాచ్ల్లోనే ఏకంగా 14 సిక్సులు కొట్టిన టీం ఇండియా పేస్ బౌలర్

By: chandrasekar Fri, 04 Sept 2020 8:29 PM

మొదటి మ్యాచ్ల్లోనే ఏకంగా 14 సిక్సులు కొట్టిన టీం ఇండియా పేస్ బౌలర్


ఇండియా టీం లో పేస్ బౌలింగ్ లో మంచి బౌన్సర్ వేసి ప్రతార్ధులను భయపెట్టే ప్లేయరే షమీ. టీమ్‌ ఇండియా పేసర్‌ మహ్మద్‌ షమి తన బౌలింగ్ ప్రతిభతో ప్రత్యర్థులను కట్టిడి చేయడంలో అతను నేర్పరీ. అవలీలగా వికెట్లు తీస్తూ టీమిండియా రెగ్యూలర్ బౌలర్లలలో ఒక్కరిగా మారిపోయారు.

షమీ బౌలింగ్‌తోనే కాదు బ్యాటింగ్‌తోను మాయ చేయగలరు. అతడి ఆడిన తొలి మ్యాచ్‌లోనే 14 సిక్సర్లు బాదాడంట! శుక్రవారంతో షమీ 30వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం దుబాయ్ ఉన్న ఆయన ప్రాక్టీస్ మునిగి తెలుతున్నారు. మహ్మద్‌ షమి పుట్టిన సందర్భంగా బర్త్‌ డే’ విషెస్‌ చెప్పిన కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌, ఆయన మాటలతో కూడిన ఓ వీడియోను ట్వీట్టర్‌లో పోస్ట్ చేసింది.

చదువుకునే రోజుల్లో తన క్రికెట్ పాఠాలు నేర్చుకుంటున్న తొలినాళ్ళలలో జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌లో తన సోదరుడు హసీబ్‌ ఆడే జట్టులో అనుకోకుండా అవకాశం వచ్చింది. ఆ‌ మ్యాచ్‌లో మొత్తం 14 సిక్సర్లు బాదినట్లు ఈ పేసర్‌ పేర్కొన్నాడు. అలా తనకు క్రికెట్‌పై మక్కువ ఏర్పడిందన్నారు. తర్వాత బౌలింగ్‌నే కెరీర్‌గా మలుచుకున్నట్లు వివరించాడు. ఇప్పుడు తన బౌలింగుతో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు ఇతను.

Tags :
|

Advertisement