Advertisement

  • బాక్సింగ్ డే టెస్ట్ సెకండ్ డే ...గిల్ , పుజారా వికెట్లు కోల్పోయిన టీమిండియా

బాక్సింగ్ డే టెస్ట్ సెకండ్ డే ...గిల్ , పుజారా వికెట్లు కోల్పోయిన టీమిండియా

By: Sankar Sun, 27 Dec 2020 08:10 AM

బాక్సింగ్ డే టెస్ట్ సెకండ్ డే ...గిల్ , పుజారా వికెట్లు కోల్పోయిన టీమిండియా


ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఓవర్ నైట్ స్కోర్ 36 పరుగులు ఒక వికెట్ నష్టంతో బరిలోకి టీమిండియా ఆచితూచి ఆడుతుంది..తొలి టెస్ట్ జరిగిన తప్పిదాలకు ఈ సారి అవకాశం ఇవ్వకూడదు అన్న విధంగా టీంఇండియా బాట్స్మెన్ బాటింగ్ చేస్తున్నారు ...అయితే ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో నెంబర్ వన్ బౌలర్ అయిన కమ్మిన్స్ ఈ రోజు ఉదయం సెషన్ లో రెండు కీలక వికెట్లు తీసి ఆస్ట్రేలియాను ముందంజలో ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు..

జట్టు స్కోరు 36 పరుగుల వద్ద రెండోరోజు ఆటను ప్రారంభించిన భారత్‌ 61 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న శుభ్‌మన్‌ గిల్‌ 65 బాల్స్‌లో 45 పరుగులు చేశాడు. కమిన్స్‌ వేసిన బంతి గిల్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకుతూ వెళ్లి వికెట్‌ కీపర్‌ టిమ్‌ పైన్‌ చేతిలో పడింది. దీంతో హాఫ్‌ సెంచరీకి మరో ఐదు పరుగుల దూరంలో వెనుతిరగాల్సి వచ్చింది...

అయితే మూడు పరుగుల తేడాతోనే మరో వికెట్‌ను కోల్పోయింది. మళ్లీ కమిన్సే భారత బ్యాట్స్‌మెన్‌ పాలిట విలన్‌గా మారాడు. అప్పటికే గిల్‌ను ఔట్‌చేసిన కమిన్స్‌ తన తర్వాతి ఓవర్‌లో పుజారా వికెట్‌ తీసుకున్నాడు. జట్టు స్కోరు 64 పరుగుల వద్ద పుజారా మూడో వికెట్‌గా వెనుతిరిగాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో వికెట్ల వెనుక పైన్‌కు దొరికిపోయాడు. దీంతో 70 బంతులు ఆడిన ఛటేశ్వర్‌ పుజారా 17 రన్స్‌తో తన ఇన్నింగ్స్‌ను ముగించాడు.

Tags :
|
|

Advertisement