Advertisement

  • భారీ మార్పులతో రెండో టెస్టులో బరిలోకి దిగనున్న టీమిండియా...

భారీ మార్పులతో రెండో టెస్టులో బరిలోకి దిగనున్న టీమిండియా...

By: Sankar Mon, 21 Dec 2020 3:59 PM

భారీ మార్పులతో రెండో టెస్టులో బరిలోకి దిగనున్న టీమిండియా...


ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తొలి టెస్ట్ అడిలైడ్ వేదికగా జరగగా టీమిండియా ఘోరపరాజయం చవి చుసిన విషయం తెలిసిందే..దీనితో అనేకమంది టీమిండియా సెలక్షన్ మీద విమర్శలు చేస్తున్నారు..దీనితో డిసెంబర్ 26 న మెల్బోర్న్ వేదికగా జరగనున్న బాక్సింగ్ డే టెస్ట్ లో టీంఇండియాలో మార్పులు జరిగే అవకాశం ఉంది...

తొలి టెస్టులో గాయపడి ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, పితృత్వ సెలవులు తీసుకుని కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు సిరీస్‌కి దూరమైపోగా.. వారి స్థానాల్లో ఎవరిని ఆడించాలి..? అని తర్జన భర్జనలు పడిన భారత్ జట్టు మేనేజ్‌మెంట్ ఆఖరిగా ఐదు మార్పులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో హైదరాబాద్‌కి చెందిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌‌‌‌ టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వడం లాంఛనంగా కనిపిస్తుండగా.. యువ క్రికెటర్ శుభమన్ గిల్‌కీ అవకాశం దక్కనుంది.

యువ ఓపెనర్ పృథ్వీ షాపై వేటు పడనుండగా.. అతని స్థానంలో కేఎల్ రాహుల్‌కి ఓపెనర్‌గా ఛాన్స్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వికెట్ కీపర్ సాహా 9, 4 పరుగులు చేయగా.. అతని స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి చోటిచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి..స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలోని ఉన్నప్పటికీ క్వారంటైన్ ఇంకా పూర్తి అవ్వకపోవడంతో రెండో టెస్ట్ కు రోహిత్ దూరం గా ఉంటున్నాడు...

Tags :
|

Advertisement